Telugu Lyrics
రానే రాదే విలువులైన జీవితం పొతే రాదే
పోనే పోదే హృదయంలో వేదనే పోనందే
రానే రాదే విలువులైన జీవితం పొతే రాదే
పోనే పోదే హృదయంలో వేదనే పోనందే
మనసు చెప్పే బాధలన్నీ
చిన్న చిన్నవంట వదిలేయ్ వదిలేయ్
కలిసి వచ్చే ఆనందాలే
హద్దులేనివంటఅడుగేయ్ అడుగెయ్
దగ్గరవుతాయి దూరం అవుతాయి
ఒక్క కౌగిలింత వలచెయ్ వలచెయ్
ముళ్ళు ఉంటాయి రాళ్ళూ ఉంటాయి
రహదారులన్నీ గెలిచేయ్ గెలిచేయ్
నీదే ఈ ఇష్టం కష్టం నష్టం ఏదేమైనా
నీదే అదృష్టం మాటే మారాలే
నీదే ఈ లోకం మొత్తం అనుకుంటేనే
ఇకపై నీదే నీదేలే
పల్లవించే కొంటె అలా పడి లేస్తే అందం హో…
పంచుకుంటే నవ్వునిలా మనదే అనుబంధం
తుళ్ళిపడే కుర్రతనం తీరమెక్కడో చూద్దాం హో…
తెల్లవారే తురుపింట తొలి వెలుగవుదాం
నిన్న మొన్నవన్ని గడిచెను వదిలేయ్
పాతరోజులన్నీ గతమేగా
నువ్వు నేను అంత స్వార్థం విడిచెయ్
చిన్నీ చేతివందే హితమేగా
స్వర్గమన్నదింక ఎక్కడో లేదు
స్వప్నమై ఉంది స్వతహాగా
సాహసాలు చేసే సత్తువ ఉంటె మనకు సొంతమేగా
దారే లేదని తుది వరకు
ధరి లేనే లేదని తడబడకు
తీరే మారదు అని అనకు
నీ తీరం దూరం చేరువరకు
రానే రాదే విలువులైన జీవితం పొతే రాదే
పోనే పోదే హృదయంలో వేదనే పోనందే
మనసు చెప్పే బాధలన్నీ
చిన్న చిన్నవంట వదిలేయ్ వదిలేయ్
కలిసి వచ్చే ఆనందాలే
హద్దులేనివంటఅడుగేయ్ అడుగెయ్
దగ్గరవుతాయి దూరం అవుతాయి
ఒక్క కౌగిలింత వలచెయ్ వలచెయ్
ముళ్ళు ఉంటాయి రాళ్ళూ ఉంటాయి
రహదారులన్నీ గెలిచేయ్ గెలిచేయ్
నీదే ఈ ఇష్టం కష్టం నష్టం ఏదేమైనా
నీదే అదృష్టం మాటే మారాలే
నీదే ఈ లోకం మొత్తం అనుకుంటేనే
ఇకపై నీదే నీదేలే హే…
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i