Telugu Lyrics
తెలియదే తెలియదే ఇదివరకెపుడైన
మనసుకే ప్రేమొకటుందని
నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని
పరిచయమొక వింతగా మలిచేను కలిసేంతగా
మరి మరి తలచే నిన్నిలా మరవలేనంత
అడుగులు ఎటు సాగిన అడుగును నిను తెలుసునా
గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా
పద పద మని మనసు ఇపుడిలా
జతపడమని అడుగుతోందిగా…
అరె అరె అరె ఎందుకో ఇలా
కుదురుగా నన్ను ఉండనీదుగా
ఆ… ఆ…
పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా
ముడి పడి వెను వెంటనే నను విడిపోతే ఎలా
వదలదు మదిలోన మొదలైన ఆవేదనా
మరణములోనైనా లేదేమో ఈ యాతన
దొరికిన వరామన్నది నా సొంతం కాదని తెలిసి
మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి
ఎద సడి అడిగనే నిలవవే వదలలేను చూడు నిన్నిలా ఒక్క క్షణమే
పద పద మని మనసు ఇపుడిలా
జతపడమని అడుగుతోందిగా…
అరె అరె అరె ఎందుకో ఇలా
కుదురుగా నన్ను ఉండనీదుగా
గతమున పొరపాటుని జరిగిన తడబాటుని
సులువుగా మరిచేదెలా పయనం మార్చేదెలా
ఎవరిని నమ్మాలి నా దారి మారేట్టుగా
ఎవరికీ చెప్పాలి ఈ బాధ తీరేట్టుగా
మనసును దాటేసిన మాటేమో పెదవులు దాటి
బయటికిరాదెంటో మొమాటం తోటి
విడువని జతవని కథవని ఎదురు చూస్తూ
నిలిచినానిలా నీ కొరకే
పద పద మని మనసు ఇపుడిలా
జతపడమని అడుగుతోందిగా…
అరె అరె అరె ఎందుకో ఇలా
కుదురుగా నన్ను ఉండనీదుగా
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }