Telugu Lyrics
పుందిరో భాంకడ నానోజా గెంకడ
జుమారో దలవాడరో
సెంకాడో సాలరీ ఓసాపు రాయరీ
మానేరో వేలవెరో
ఓ రంగు రంగు రెక్కలున్నా
సీతాకోక సిలుకల్లే
చెంగు చెంగు మంటాందె మనసు
తొంగి తొంగి సుసేటి
మబ్బు సాటు మెరుపల్లె
పొంగి పొంగి పోతాందే మనసు
ఈ గాలిలో ఏమున్నదో
రాగాలు తీసింది ప్రాణం
తారారిరో తారారిరో
అని పాటేదో పాడిస్తుంది ఈ ఆనందం
ఇంతందంగా ఉంటుందా ఈ లోకం
ఇన్నాళ్లు ఈ మనసుకి
తెలియలేదే పాపం
పుందిరో భాంకడ నానోజా గెంకడ
జుమారో దలవాడరో
సెంకాడో సాలరీ ఓసాపు రాయరీ
మానేరో వేలవెరో
ఓ తెల్లవారు జాముల్లో
సన్నజాజి పువ్వల్లె
మురిసి మురిసి పోతాందే మనసు
పిల్లలొచ్చి ఎగరేసే తెల్ల గాలి పఠమల్లే
ఎగసి ఎగసి పడతాందే మనసు
కలలే లేని కన్నుల్లోన
కథలేవో కనిపిస్తున్నాయే
అలలే లేని గుండెల్లోనా
గల గల మని పొంగాలే ఆశల అలలే
ఇంతందంగా ఉంటుందా ఈ లోకం
ఇంద్రలోక భవనాన్నే
ఈడ్చుకొచ్చి ఈ గదిలో
మార్చి మళ్ళి కట్టారో ఏమో
నాయగానము
తెలుసు
మంత్ర గారడీలు తెలుసు రెంటికన్నా
ఇది ఇంకోటేమో
నీలాకాశం నేలకొస్తే
ఇట్టాగే ఉంటాదో ఏమో
ఈ సంతోషం దాచాలంటే
హృదయాలు ఓ వంద కావాలేమో
ఇంతందంగా ఉంటుందా ఈ లోకం
ఇన్నాళ్లు ఈ మనసుకి
తెలియలేదే పాపం
పుందిరో భాంకడ నానోజా గెంకడ
జుమారో దలవాడరో
సెంకాడో సాలరీ ఓసాపు రాయరీ
మానేరో వేలవెరో
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i