Nuvvemo Song Lyrics


Movie: Uma Maheswara Ugra Roopasya
Music : Bijibal
Vocals :  Kalabhairava, Sithara
Lyrics : Rahman
Year: 2020
Director: Maha Venkatesh
 

Telugu Lyrics

నువ్వేమో రెక్కలు చాచి

రివ్వున లేచిన పక్షయ్యి పైకి ఎగిరి పోయావే

నెనేమో మట్టిలో వేర్లు చుట్టుకుపోయిన

చెట్టై ఇక్కడనే ఉన్నానే

కోరుకున్న లోకాలు చూడ ఈ కొనను విడిచి పోతే ఎలా

కొమ్మలన్నీ శోకాలు తీస్తూ

కుంగాయి లోలోపల

ఇక నా లోకమొ నీ లోకమో

ఒకటెట్టా అవుతాది

కసిగా కసిరే ఈ ఎండలే

నీ తలపులుగా ఈ కలతలుగా

నిసిగా ముసిరే నా గుండె నే

పగటి కళలు ముగిసేలా

వెలుగే కరిగి పోయింది లే

ఉసిరే నలిగి పోయింది లే

ఆశలల్లే ఆకులే రాలి మనసే పెళుసై విరిగిపోయేలే

మాటలన్నీ గాలి మూటలై పగిలి పోయాయిలే

చేతిలో గీతలు రాతలు మారిపోయే

చూడు మాయదారినే

ఊగే కొమ్మకు సాగే పిట్టకు

ఒంటె ఎలికి పేరేంటనా

పూసే పులకి వీచే గాలికి స్నేహం ఎన్నాలట

నేనేమో ఎల్లలు ధాటి నచ్చిన దారిన ముందుకు సాగేటి

ఓ దాహం…

నువ్వేమో మచ్చలు లేని మబ్బులు పట్టని అద్దంలా మెరిసే

ఓ స్నేహం…

తప్పదంటూ నీతోనే ఉండి

నీ మనసు ఒప్పించలేను మరి

తప్పలేదు తప్పని సరై ఎంచాను ఈ దారిని

నిన్ను నీలాగానే చూడడని దూరంగా వెళ్తున్న

Leave a Comment