Telugu Lyrics
తందనే తనననేనానే
తందనే తనననేనానే
తాననే తందినానే తాననే తనననేనానే
వెలుతురు తింటది ఆకు
వెలుతురు తింటది ఆకు
ఆకును తింటది మేక
ఆకును తింటది మేక
మేకను తింటది పులి
మేకను తింటది పులి
ఇది కదరా ఆకలి
ఇది కదరా ఆకలి
పులినే తింటది చావు
చావుని తింటది కాలం
కాలాన్ని తింటాడు కాళీ
ఇది మహా ఆకలి
ఆహ్ ఆహ్ ఆహ్
వేటాడేది ఒకటి
పరిగెత్తేది ఇంకోకటే
దొరికిందా ఇది సస్తాది
దొరక్కపోతే అది సస్తాది
ఒక జీవికి ఆకలేసిందా
ఇంకో జీవికి ఆయువు మూడిందే
హే దాక్కో దాక్కో మేక
పులొచ్చి కోరుకుద్ది పీక హుయ్
చేపకు పురుగు ఎరా
పిట్టకి నూకలు ఎరా
కుక్కకి మాంసం ముక్క ఎరా
మనుషులందరికి బతుకే ఎరా
ఆహ్ ఆహ్ ఆహ్
గంగమ్మ తల్లి జాతర
కోళ్లు పొట్టేళ్ల కోతర
కత్తికి నెత్తుటి పుతర
దేవతకైనా తప్పదు ఎర
ఇది లోకం తల రాతర
ఆహ్ ఆహ్ ఆహ్
ఏమరుపాటుగా ఉన్నావా
ఎరకే చిక్కేస్తావు
ఎరనే మింగే ఆకలుంటే
ఇక్కడ బతికుంటావు హా
కాలే కడుపు సూడదు రో నీతి న్యాయం
బలం ఉన్నోడి దేరా ఇక్కడ ఇష్టారాజ్యం
హే దాక్కో దాక్కో మేక
పులొచ్చి కోరుకుద్ది పీక హుయ్
అడిగితే పుట్టదు అరువు… అరువు
బ్రతిమాలితే బ్రతుకే బరువు… బరువు
కొట్టర ఉండదు కరువు
దేవుడికైనా దెబ్బె గురువు
ఆహ్ ఆహ్ ఆహ్
తన్నులు చేసే మేలు తమ్ముడు కూడా చెయ్యడు
బుద్దుడు చెప్పే పాఠం
బద్దుడు కూడా చెప్పాడే హే
తగ్గేదే లే
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i